బోనమెత్తిన సింగపూర్

16 Jul, 2017 20:03 IST|Sakshi


సుంగే కేడుట్(సింగపూర్) :

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్లో తొలిసారిగా బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ బోనాల జాతర స్థానిక సుంగే కేడుట్ లోని అరసకేసరి శివన్ టెంపుల్లో ఎంతో కన్నుల పండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు భక్తిశ్రద్ధలతో దుర్గా దేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజు వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ బోనాల వేడుకలో సింగపూర్లో ఉన్న తెలుగు వారితోపాటూ, ఇతరులు పెద్దమొత్తంలో పాల్గొన్నారు.  ఈ బోనాల పండుగ ను తొలిసారిగా సింగపూర్ లో జరపడం ద్వారా టీసీఎస్ఎస్ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. వేడుక అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు, నీలం మహేందర్, పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీను, ముదాo అశోక్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి గడప రమేష్, కార్యవర్గ  సభ్యులు అలసాని కృష్ణ, చిల్క సురేశ్, దుర్గ ప్రసాద్, మిర్యాల సునీత, ఎల్లా రాం, పెద్దపల్లి వినయ్, ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గరెపల్లి శ్రీనివాస్, శివ రామ్, చెట్టిపల్లి మహేష్, ఆర్. సి రెడ్డి, నల్ల భాస్కర్, దామోదర్, భరత్లు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు