భారత స్వాతంత్ర్య వేడుకల్లో టాక్‌

11 Sep, 2017 19:24 IST|Sakshi



లండన్‌: లండన్ లోని భారత హై కమీషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన స్వాతంత్ర్య  వేడుకల్లో, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీషనర్ వైకే సిన్హా ముందుగా జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది ప్రవాస భారతీయులు ఈ వేడుకకు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం, తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ భారీ కటౌట్.. టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ అన్నింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత మూడు సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్‌లో ప్రదర్శించారు.  తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు.
 
తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి  వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావన తో, టాక్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రముఖులు, తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, మూడు సంవత్సరాలుగా సాధించిన విజాయాల తో కూడిన  ప్రత్యేక ‘తెలంగాణా  స్టాల్’ ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు. చేనేత పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ నాయత్వంలో చేనేత వస్త్రాలపై  తీసుకొస్తున్న అవగాహనను కూడా టాక్ సంస్థ తన ప్రదర్శన లో పెట్టింది.
 
భారత హై కమీషనర్ వైకే సిన్హా, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లిమెంట్ సభ్యులు  వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, ఇతర ప్రతినిధుల బృందం ‘తెలంగాణా స్టాల్’ ని  సందర్శించారు. తెలంగాణా సంస్కృతి - సాంప్రదాయాలను ప్రపంచానికి  చూపించాలనే ప్రయత్నం చాలా స్పూర్తిదాయకంగా ఉందని  ప్రశంసించారు. అలాగే తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు గమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను టాక్ సంస్థ ప్రతినిధులని అడిగి తెలుసుకున్నారు.

 
స్టాల్ లో ఏర్పాటు  చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పటాలకు  నివాళులు అర్పించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్ ను భారత హై  కమిషనర్ వైకే సిన్హా  కట్ చేశారు. ప్రవాస తెలంగాణా వాసులు ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించారు. తెలంగాణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్న తీరుని అభినందించారు. చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ తనం విదేశీ గడ్డపై ఉట్టిపలే ఉందని అభినందించారు. ఫోటోలు, సెల్ఫీలతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది.
 
‘తెలంగాణా జానపద నృత్యం’ను  సాంస్కృతిక వేదిక పై ప్రదర్శించడం విశేషం. దీంతో అతిథులు కేరింతలతో ఎంతో ఉత్సాహంగా లేచి వారితో జత కలిసి నృత్యం చేశారు. తెలంగాణ జానపద నృత్యం  సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో హైలైట్ గా నిలిచింది. జానపద నృత్య ప్రదర్శన ఇచ్చిన సత్య చిలుముల, వంశీ చిడిపోతు, నాగరాజు మన్నం, శివకుమార్ గ్రంధి, దేవి ప్రవీణ్ అడబాల( చెర్రీ) , తిరు కణపురం, రుచిత రేణికుంటలను.. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అభినందించారు. ‘తెలంగాణా స్టాల్’ ని సందర్శించిన ఆతిథులందరికి మన  ‘హైదరాబాద్ బిర్యానీ’ రుచి చూపించారు.



ఈ  కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల, ప్రధాన కార్యదర్శి  విక్రమ్ రెడ్డి రేకుల, జాయింట్ సెక్రటరీ లు నవీన్ రెడ్డి ,శ్రీకాంత్ జెల్ల, ఇవెంట్స్ , కల్చరల్ ఇన్‌చార్జ్ అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, రీడింగ్ సెక్రటరీ, స్పోర్ట్స్ఇంచార్జ్ మల్లా రెడ్డి, మహిళా విభాగం ఇంచార్జ్ సుమా దేవిపురుమని, మహిళా విభాగం సెక్రటరీ సుప్రజ పులుసు, మహిళా విభాగం సభ్యులు ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, కల్చరల్‌ సెక్రెటరీలు సత్య చిలుముల, శ్రావ్య వందనపు, కల్చరల్ కోఆర్డినేటర్ శైలజ జెల్ల, స్పాన్సర్ సెక్రటరీ రవి రత్తినేని, ఐటీ ఇంచార్జ్ రవి ప్రదీప్ పులుసు, సంస్థ సభ్యులు రవికిరణ్, వెంకీ సుదిరెడ్డి, నవీన్ భువనగిరి, సుషుమ్న, సుమ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.













మరిన్ని వార్తలు