తెలంగాణ బిడ్డకు ఆర్థిక సహాయం

29 May, 2017 22:47 IST|Sakshi
తెలంగాణ బిడ్డకు ఆర్థిక సహాయం

జగిత్యాల :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన గడ్డం భూపతి రెడ్డి బతుకు తెరువు కోసం 5 సంవత్సరాల కింద కార్మిక వీసా పై సింగపూర్ వచ్చాడు. అయితే, దురదృష్టవశాత్తూ గత కొన్ని నెలలుగా శ్వాసకోశ సంబధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక్కడి వైద్యశాలలో వైద్యులను సంప్రదించగా ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్య ఉన్నట్టు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేయవలసిందిగా చెప్పారు. భూపతి రెడ్డి పని చేసే కంపెనీ చికిత్సకు కావాల్సిన ఖర్చులకు కొంత వరకు సహాయం చేశారు. కానీ ఆరోగ్యం కొంత కుదుట పడిన తరువాత జబ్బు తీవ్రత  దృష్ట్యా వీసాను రద్దు చేసి మే 28న ఇండియాకు తిరిగి పంపించారు.

ఇండియాకు వచ్చిన తరువాత చికిత్సను కొనసాగించవలసిందిగా వైద్యులు సూచించారు. భాదితుని ఆరోగ్య సమస్య విషయం తెలంగాణ కల్చరల్ సొసైటి, సింగపూర్ దృష్టికి రావడంతో, తెలంగాణ వాసి ప్రాణం కాపాడడానికి అయ్యే ఆసుపత్రి ఖర్చులకు సహాయపడాలనే ఉద్దేశ్యంతో.. తెలంగాణ కల్చరల్ సొసైటి, సింగపూర్ ఇచ్చిన పిలుపు మేరకు కొందరు సభ్యులు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేశారు. సేకరించిన డబ్బులు మొత్తం 4,565 సింగపూర్ డాలర్లు (సుమారు రెండు లక్షల పది వేల రూపాయలు) బాధితునికి సొసైటీ తరపున అధ్యక్షుడు బండ మాధవ రెడ్డి, కార్యదర్శి బసిక ప్రశాంత్, ఉపాధ్యక్షులు పెద్ది శేఖర్, ఇతర సభ్యులు, చెట్టిపెల్లి మహేష్, ఉమేందర్, శ్రీనివాస్, జితేందర్  మొదలగు వారు అందజేశారు. ఇందుకు సహకారం అందించిన వారందరికీ సొసైటీ తరపున కార్యవర్గ సభ్యులు పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేశారు.

మరిన్ని వార్తలు