అట్టహాసంగా తానా వేడుకలు

4 Jul, 2015 11:11 IST|Sakshi
అట్టహాసంగా తానా వేడుకలు

డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మహాసభల వేడుకలు గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) ఘనంగా ప్రారంభమయ్యాయి. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. స్థానికంగా నూతన తానా భవనాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆ రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొని వేడుకలను తిలకించారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నటులు వెంకటేశ్, అల్లరి నరేశ్, నవదీప్, నిఖిల్, తాప్సీ, రచయితలు సుద్దాల అశోక్‌తేజ, జొన్నవిత్తుల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, అట్లూరి సుబ్బారావు తదితరులు వేడుకలకు హాజరయ్యారు.

తానా సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్, అధ్యక్షుడు నన్నపనేని మోహన్ అతిథులకు స్వాగతం పలికారు. సుద్దాల అశోక్‌తేజ, డా.పొదిలి ప్రసాద్, డా.గోపీచంద్, డా.ఎన్.ఎస్.రెడ్డి, ఆర్.శ్రీహరి, డా.కాకిరాల ప్రసాద్, డా.గంగా చౌదరి, డా.శివాజీరావు అవార్డులు అందుకున్నారు.

Read latest Diaspora News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా