లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

12 Mar, 2017 17:17 IST|Sakshi
లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

లండన్‌:
అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను టాక్‌ ఆధ్వర్యంలోలండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్‌ అజ్మీర్‌గారేవాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వీరవనితలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్‌ను ప్రారంభించారు. లండన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ మహిళలు అంతా ఒకేచోట సమావేశమై కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో టాక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, టాక్‌ అధ్యక్షురాలు కంది పవిత్రారెడ్డి, సభ్యులు బుడుగం స్వాతి, జాహ్నవి, శ్రావ్య, సుప్రజ, సుమ, శ్రీలత, విజయలక్ష్మి, ప్రవళిక, ప్రవాసభారతీయులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు