మేరీలాండ్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

12 Jul, 2016 13:05 IST|Sakshi


ఏలికట్ సిటీ, మేరీలాండ్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలు అమెరికాలోని ఏలికట్ సిటీ  పాటపాస్కో వ్యాలీ స్టేట్ పార్క్లో శనివారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వందకు పైగా తెలుగు ఎన్నారై కుటుంబాలు ఒకచోట చేరి వైఎస్ఆర్ పుట్టినరోజు వేడుకను పండుగలా చేసుకున్నాయి.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు మాట్లాడుతూ...మళ్లీ రాజన్నరాజ్యం రావాలని, వైఎస్ జగన్ వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల కష్టాలు తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మహానేత తనయుడు జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యం అని మహానేత వైయస్సార్ పాలన మళ్లీ రావాలని,  వైయస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసిన టీడీపీని ప్రజలే త్వరలో సాగనంపుతారన్నారు.

అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో ప్రజలను వంచించిన  చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచి వారి తరపున పోరాడుతున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు రోజురోజుకు ప్రజాధారణ పెరుగుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు  మాట్లాడుతూ..  వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. ‘వ్యవసాయం దండగ కాదు పండగ’ అని రుజువు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు