అంతటా వర్షం

14 Sep, 2016 01:09 IST|Sakshi
అంతటా వర్షం
నల్లగొండ అగ్రికల్చర్‌ : ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు మెట్టపంటలతో పాటు ఎండుతున్న వరిపొలాలకు జీవం పోశాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 59 మండలాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి. పలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మంగళవారం బక్రీద్‌ పర్వదినం కావడంతో ముస్లిం సోదరులు నానా అవస్థలు పడ్డారు. జిల్లాలో అత్యధికంగా నిడమనూరు మండలంలో 102.2 మి.మీటర్లు, అనుములలో 93.4 మి.మీటర్లు, దేవరకొండలో 92.2 మి.మీటర్లు వర్షం కురిసింది. అదే విధంగా చింతపల్లిలో 80.0, నల్లగొండలో 75.6, నేరేడుచర్లలో 68.4, మిర్యాలగూడ 65.8, గుర్రంపోడులో 64.2, త్రిపురారంలో 64.2, కనగల్‌లో 53.4, వేములపల్లిలో 52.6, తిప్పర్తిలో 52.4, మి.మీటర్లు వర్షం కురిసింది. చందంపేటలో 49.8, చండూరులో 43.3, దామరచర్ల 43.2, గుండ్రపల్లి 42.2, నాంపల్లి 41.0, రామన్నపేట 40.8, మునగాల 39.2, మునుగోడు 38.0 , గరిడేపల్లి 37.4, మర్రిగూడ 36.4, హుజూర్‌నగర్‌ 36.4, కేతెపల్లి 36.0 మి.మీటర్ల వర్షం కురిసింది. పెన్‌పహాడ్‌ మండలంలో 34.2, పెద్దవూర 31.4, సూర్యాపేట 31.0, నార్కట్‌పల్లి 30.2, పీఏపల్లి 30.0, నారాయణపూర్‌ 26.4, మోతె 26.2, నకిరేకల్‌ 26.0, తుర్కపల్లి 23.6, కట్టంగూరు 22.8, శాలిగౌరారం 22.6, చిలుకూరు 20.6, వలిగొండ 20.0, నడిగూడెం 20.0, చిట్యాల 19.6, చౌటుప్పల్‌ 19.4, జాజిరెడ్డిగూడెం 18.2, చివ్వెంల 18.2, ఆత్మకూర్‌ ఎస్‌ 17.8, భువనగిరి 17.2, తిరుమలగిరి 14.8, కోదాడ 14.2,  గుండాల 13.6,  పోచంపల్లి 12.8, మోత్కూరు 12.6, తిప్పర్తి 12.6, మట్టంపల్లి 10.2 మి.మీటర్ల వర్షం కురిసింది. నూతన్‌కల్‌లో 9.4, బొమ్మలరామారంలో 8.4, బీబీనగర్‌లో 8.4, యాదగిరిగుట్టలో 7.4, ఆత్మకూరులో 6.8,ఆలేరులో 5.2,మేళ్లచెరువులో 4.8, రాజాపేట 3.4 మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 33.4 మి.మీటర్ల వర్షం కురిసింది.
640.2 అడుగులకు చేరిన మూసీ నీటి మట్టం
కేతేపల్లి: జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ రిజర్వాయర్‌ నీటిమట్టం 640.2 అడుగులకు చేరుకుంది.  అల్పపీడన ప్రభావంతో  గత  రెండు రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌లోకి  సోమవారం సాయంత్రం నుండి  ఇన్‌ఫ్లో ప్రారంభమైంది.  దీంతో ప్రాజెక్టులో  నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి  640.2 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 1050 క్యూసెక్‌ల వరదనీరు రిజర్వాయర్‌లో చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 
మరిన్ని వార్తలు