భోజనం సరిగా పెట్టడం లేదు

14 Sep, 2016 01:19 IST|Sakshi
భోజనం సరిగా పెట్టడం లేదు
భూదాన్‌పోచంపల్లి : భోజనం సరిగా పెట్టడం లేదని ఆగ్రహిస్తూ మంగళవారం భూదాన్‌పోచంపల్లి మం డల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు ధర్నాకు దిగారు. విద్యాలయం బయట భోజనం చేసి నిరసన తెలిపారు. మెనూ అసలే పాటించడం లేదని,  సరిపోను భోజనం పెట్ట డం లేదని, అర్థాకలితో ఉంటామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్డు వండిపెట్టడం లేదని, కూరలు కూడా లేక కారంపొడితో తింటున్నామని కన్నీంటి పర్యంతమయ్యారు. ప్రత్యేకాధికారిణి అడిగితే దుర్భాషలాడుతుందని వాపోయారు. 20 మం దికి సరిపోయే కూరగాయలు తెచ్చి 120 మందికి అరకొరగా పెడుతున్నారని పేర్కొన్నారు. కూరలు లేక రెండు రోజులుగా భోజనం చేయలేకపోతున్నామన్నారు. ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్‌ పాఠశాలకు చేరుకొని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ వరలక్ష్మి  అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో జలాల్‌పురం సర్పంచ్‌ శాపాక భిక్షపతి, చంద్రం, తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు