పెరిగిన గోదావరి ఉధృతి

14 Sep, 2016 22:23 IST|Sakshi
ధవళేశ్వరం:
 గోదావరి ఉధృతి బుధవారం మరింత పెరగడంతో బ్యారేజ్‌ నుంచి బుధవారం సాయంత్రం 4,15,308 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం 9.50అడుగులకు  చేరుకుంది. స్థానికంగా కూడా వర్షాలు పడుతుండటంతో డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. తూర్పు డెల్టాకు 1800, మధ్య డెల్టాకు 2200, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో  కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. కాళేశ్వరంలో 7.11 మీటర్లు, పేరూరులో 10.01 మీటర్లు, దుమ్ముగూడెంలో 9.15 మీటర్లు, భద్రాచలంలో 32 అడుగులు, కూనవరంలో 10.82 మీటర్లు, కుంటలో 7.10 మీటర్లు, కొయిదాలో 14.29 మీటర్లు, పోలవరంలో 9.56 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.33 మీటర్ల  నీటిమట్టాలు నమోదయ్యాయి.
 
మరిన్ని వార్తలు