హోరాహోరీగా టెన్నిస్‌ పోటీలు

16 Nov, 2016 01:01 IST|Sakshi
హోరాహోరీగా టెన్నిస్‌ పోటీలు
భీమవరంలో,  జాతీయ స్థాయిలో , మంగళవారం
భీమవరం : స్థానిక యూత్‌క్లబ్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు మంగళవారం హోరాహోరీగా సాగాయి. కాగా మహిళల విభాగం పోటీలు సాయంత్రం వర్షం కారణంగా నిలిచిపోయాయి. అప్పటి వరకూ జరిగిన పోటీల్లోని విజేతల వివరాలను యూత్‌ క్లబ్‌ కార్యదర్శి డీఎస్‌ రాజు తెలిపారు. తెలంగాణాకు చెందిన సామా సాత్విక అదే రాష్ట్రానికి చెందిన దేదీప్య వై.సాయిపై 6–2, 6–0 స్కోరుతో విజయం సాధించగా, తమిళనాడుకు చెందిన బి.నిత్యరాజ్‌ ఒడిస్సాకు చెందిన షిల్పి ప్రధా న్‌ దాస్‌పై 6–0, 6–2 తేడాతో, తమిళనాడుకు చెందిన సహజ యమలనపల్లి కర్నాటకకు చెందిన ఎస్‌.సోహాపై 4–6, 6–4, 6–3 తేడాతో విజయం సాధించగా, కర్నాటకు చెందిన ఎస్‌బీ అపూర్వ తెలంగాణాకు చెందిన సింధు జంగంపై 6–2, 6–1 తేడాతో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భువన కల్వ ఎ న్‌.శ్వేతపై 6–1, 6–0 తేడాతో గెలుపొందారు.
 
 
 
మరిన్ని వార్తలు