10.814 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి

9 Jan, 2017 00:33 IST|Sakshi
10.814 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి
శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం కుడి,ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో శనివారం నుంచి ఆదివారం వరకు 10.814 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. విద్యుత్‌ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 21,156 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రాంతంలోని కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 5.395, తెలంగాణా ప్రాంతంలోని ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 5.419 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేశారు. ఆదివారం ఇరు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్‌ డిమాండ్‌ను అనుసరించి లోడ్‌ డిశ్పాచ్‌ ఆదేశాలమేరకు పీక్‌లోడ్‌ ఆవర్స్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనివాసుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 104.8974 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 859.70 అడుగులకు చేరుకుంది. 
మరిన్ని వార్తలు