డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 10 కేసులు నమోదు

13 Jan, 2016 19:01 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఎల్‌బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో 10 కేసులను నమోదు చేసి వారిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల భార్య, తల్లిదండ్రులను పిలిపించి మేజిస్ట్రేట్ పుష్పాదేశ్‌ముఖ్ వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు