100 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

3 Oct, 2016 01:05 IST|Sakshi
100 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

 

రాపూరు : రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు మండలంలోని కండలేరు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఆటోల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని గుర్తించామన్నారు. ఆటోల్లో సుమారు 100 బస్తాల బియ్యంను స్వాధీనం చేసుకుని, ఆటో డ్రైవర్లు రమేష్, వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రేషన్‌ బియ్యం విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు సమాచారం అందించామని, బియ్యాన్ని వారికి అప్పగిస్తామని తెలిపారు.çç ఈ బియ్యం ఎక్కడి నుంచి, ఎక్కడికి తరలిస్తున్నారో విచారిస్తామన్నారు.  
 

 

మరిన్ని వార్తలు