రూ.1024 కోట్లతో 330 గోదాంలు

4 Aug, 2016 23:23 IST|Sakshi
రూ.1024 కోట్లతో 330 గోదాంలు
తిరుమలగిరి : మార్కెట్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.1024 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 330 గోదాంలు నిర్మిస్తున్నట్లు మార్కెంటింగ్‌ శాఖ కమిషనర్‌ శరత్‌ తెలిపారు. గురువారం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో మెుక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న గోదాముల్లో 19 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేయవచ్చని తెలిపారు. గోదాంల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. నల్లగొండ జిల్లాలో 26 గోదాంల నిర్మాణాలకు 18 పూర్తయినట్లు తెలిపారు. జాతీయ ఈ మార్కెట్‌ విధానంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని పేర్కొన్నారు. మొదటి విడతలో 5, రెండో విడుతలో 39 మార్కెట్లలో ఈ విధానం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. మార్కెట్‌ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన సూపర్‌వైజర్‌ను సస్పెండ్‌ చేశామని, ఎలక్ట్రీషియన్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  మార్కెట్‌శాఖ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలను నాటాలని ప్రణాళికలు రూపొందించామని ఇప్పటి వరకు 7లక్షల 50వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. 
 ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కార్యదర్శి నవీన్‌రెడ్డి, పాశం యాదవరెడ్డి, సిబ్బంది కిరణ్, జర్మయ్య పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు