బ్యారేజ్‌ వద్ద 11.5 అడుగులు నీటి నిల్వ

14 Aug, 2016 01:06 IST|Sakshi
బ్యారేజ్‌ వద్ద 11.5 అడుగులు నీటి నిల్వ
మంత్రి దేవినేని ఉమా
విజయవాడ సెంట్రల్‌ : 
కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రకాశం బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటి సామర్థ్యానికి చర్యలు చేపట్టామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. శనివారం మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. ఈనెల ఐదో తేదీన ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 5.3 అడుగుల నీరు ఉందని 12వ తేదీన దాన్ని 11.1 అడుగులకు చేర్చామన్నారు. కృష్ణాడెల్టాకు 9083 క్యూసెక్కులు కాల్వలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు శివారు ప్రాంతాలకు నీటిని అందిస్తామన్నారు. 
మెరుగైన సేవలు..
భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మంత్రి ఉమా చెప్పారు. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పుష్కరాలను సమీక్షిస్తున్నారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్టప్రాంతానికి చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నీటని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 
 
మరిన్ని వార్తలు