11 రోజులు సమాధిలో..

22 Oct, 2016 23:21 IST|Sakshi
11 రోజులు సమాధిలో..

సాక్షి, బళ్లారి(కర్ణాటక) : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు ఎలాంటి అన్నపానీయాలు తీసుకోకుండా సమాధిలోనే ఉండిపోయారు ఓ స్వామీజీ. అనంతరం ధ్యానముద్ర నుంచి మేల్కొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లా చింతనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని  సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఈ నెల 11న రాచోటేశ్వర అనే స్వామీజీ ధ్యానముద్రలో కూర్చొన్నారు. తర్వాత గ్రామస్తులు, భక్తులు కలిసి స్వామీజీ చుట్టూ రాళ్లతో సమాధి నిర్మించారు.

గాలి, వెలుతురు లేకుండా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం సమాధిని తొలగించారు. ఉజ్జయిని జగద్గురు మరుళు సిద్ధ దేశీ కేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో యోగముద్రలో ఉన్న రాచోటేశ్వర స్వామీజీని ధ్యాన విముక్తుణ్ని చేయించారు. ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామీజీ మాట్లాడుతూ జనం సంతోషంగా ఉండాలని, వర్షాలు సమద్ధిగా వచ్చి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో  11 రోజుల పాటు ధ్యానం చేశానన్నారు.  కాగా.. రాచోటేశ్వర  స్వామీజీ గతంలో కూడా 41 రోజులు ధ్యానంలో ఉన్నారని భక్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు