పన్నెండో సారి...!!

27 Jan, 2017 01:39 IST|Sakshi
పన్నెండో సారి...!!

అనంతపురం అగ్రికల్చర్‌ : చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్‌.విజయశంకరరెడ్డి 1990 నుంచి జిల్లాలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఏపీడీ)గా గత రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాతృశాఖ వ్యవసాయశాఖ అయినా నిజాంషుగర్స్, డ్వామా, ఆత్మ, ఏపీఎంఐపీ శాఖల్లోనే ఎక్కువ కాలం పనిచేశారు.

ఎక్కడున్నా విధి నిర్వహణలో అంకితభావం ఆయన సొంతమని ఆయాశాఖల అధికారులు చెబుతున్నారు. అందుకే ఆయన ఇప్పటివరకు 12 సార్లు ఉత్తమ అధికారిగా అవార్డు దక్కించుకున్నారు. అందులో రెండు సార్లు రాష్ట్ర స్థాయి అవార్డు, మిగతా 10 సార్లు జిల్లా స్థాయిలో అవార్డు పొందారు. తాజాగా రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో కలెక్టర్‌ కోన శశిధర్‌ చేతుల మీదుగా 12వ సారి అవార్డు సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు