రహదారుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లు

27 Jan, 2017 00:19 IST|Sakshi
రహదారుల అభివృద్ధికి రూ.13 వేల కోట్లు
మంత్రి శిద్దా రాఘవరావు
ఆత్రేయపురం: (కొత్తపేట నియోజకవర్గ): రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్డు భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆత్రేయపురం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా చేపడుతున్న రూ.6 కోట్ల రహదారి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన పనులు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రూ.30 వేల కోట్లతో అనంతపురం నుంచి అమరావతి వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. 8 గంటల సమయంలో ప్రయాణం అమరావతి చేరుకోవచ్చునని ఆయన వివరించారు. ప్రభుత్వం సంక్షేమం పథకాలు అందించడంతోపాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అబివృద్ధి చేసేందుకు కారిడార్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సముద్ర తీరం వెంబడి రహదార్లు నిర్మించి జాతీయ రహదారికి అనుసంధానంగా ఉత్పత్తులు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని దీనికి సంబంధించి రూ.30 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. ట్రాన్స్‌పోర్టు శాఖ అ¯ŒSలై¯ŒS ద్వారా విస్తృత సేవలు అందింస్తుందన్నారు. డీలర్‌ వద్ద నుండే వాహనం కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేష¯ŒS నిర్వహించే ప్రక్రియ నూతనంగా ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి రెడ్డి సుబ్రహ్మణ్యం, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, ఈఈ ఎ. శ్రీరామచంద్రరావు, అర్‌టీసీ ఆర్‌ఎమ్‌ చింతా రవికుమార్, డిఎమ్‌ షభ్నం తదితరులు పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు