‘పుష్కరాల’ పోటీల్లో విజేతలు 140 మంది

24 Aug, 2016 22:43 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విద్యార్థులకు 12 అంశాలపై మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతల వివరాలను బుధవారం ప్రకటించారు. మొత్తం 1610 మంది విద్యార్థులకు 140 మంది విజేతలుగా నిలిచారు. అలాగే ‘కృష్ణా పుష్కరాలు’ అనే అంశంపై ప్రత్యేకంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వ పోటీల్లో 415 మందికి  18 మంది విజేతలుగా నిలిచారు. విజేతల జాబితా డీఈఓ బ్లాగ్‌ స్పాట్‌లో ఉంచామని, మండల విద్యాశాఖ అధికారులకు పంపామని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య తెలిపారు. 

మరిన్ని వార్తలు