-

కోనసీమంతటా 144 సెక్షన్‌ అమలు

16 Nov, 2016 00:05 IST|Sakshi
  • అమలాపురంలో కాపు నేతల ఇళ్లు దిగ్బంధం
  • అజ్ఞాతంలోకి  ముఖ్య నేతలు
  • పోలీసుల మోహరింపు
  • డ్రోన్లతో డేగకన్ను
  • అమలాపురం టౌన్‌ : 
    ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర నేపధ్యంలో కోనసీమ అంతటా మంగళవారం ఉదయం ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌ 144 సెక్ష¯ŒS అమలుకు ఆదేశాలు జారీ చేశారు. కాపు ఉద్యమాల్లో ముద్రగడ పద్మనాభంతో పాటు కీలకంగా వ్యవహరిస్తున్న అమలాపురంలోని ముగ్గురు కాపు నేతల ఇళ్లను దిగ్భం«ధించారు. బుధవారం రావులపాలెం నుంచి నిర్వహించే పాదయాత్రకు వారిని వెళ్లనీయకుండా మంగళవారం ఉద యం నుంచే పోలీసులు అమలాపురంలోని కాపు నేతల ఇళ్లను చుట్టిముట్టారు. అయితే వారు అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం తో వారి ఇళ్ల వద్దే పోలీసు పికెట్లు ఏర్పాటుచేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, ఆయన కుమారుడు రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా పవ¯ŒSకుమార్, కోనసీమ తెలగ బలిజ కాపు (టీబీకే) అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి మాజీ అ««దl్యక్షుడు దివంగత నల్లా సూర్యచంద్రరావు ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దివంగత చంద్రరావు కుమారులు అజయ్, సంజయ్‌లు ఇంటి వద్ద లేరు. నల్లా విష్ణుమూర్తి, నల్లా పవనకుమార్‌లు సోమవారం రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక కల్వకొలను తాతాజీ ఇంటి వద్దకు మంగళవారం ఉదయమే పోలీసులు బందోబస్తుకు వెళ్లినప్పుడు ఆయను పోలీసులు నిలువరించే ప్రయత్నంచేశారు. ఓ పెళ్లి ఇంటికి వెళ్లి వచ్చేస్తానని చెప్పి అక్కడ నుంచి తప్పించుకుని మళ్లీ ఇంటికి రాలేదు. పట్టణానికి చెందిన మరో కాపు నేత, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి మెండగుదటి మోహ¯ŒS కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు.
     
మరిన్ని వార్తలు