ఉర్దూ వర్సిటీకి 144.34 ఎకరాల భూమి కేటాయింపు
13 Apr, 2017 00:45 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్): ఉర్దూ యూనివర్సిటీకి 144.34 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓర్వకల్లు గ్రామంలోని 531, 556ఎ తదితర సర్వే నబర్లలోని ప్రభుత్వ భూములను వర్సిటికీ కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి జేసీ శర్మ.. జీవో ఆర్టీ నబరు 379ని జారీ చేశారు. ఈ భూములను హయ్యర్ ఎడ్యుకేషన్‌కు అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు.