149 మంది డీలర్ల సస్పెన్షన్‌

20 Nov, 2016 01:06 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌) : ఈపాస్‌ మిషన్లను బైపాస్‌ చేసి సరుకులను కొల్లగొట్టిన 149 మంది డీలర్లను ఆర్డీఓలు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  వీరందరిపై క్రిమినల్‌కేసులు నమోదు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లకు, అర్బన్‌ ప్రాంతాల్లో ఏఎస్‌ఓలకు ఆర్డీఓలు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఏఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి నగరంలోని వందమంది డీలర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నాలుగు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. కర్నూలు నగరంలో మొత్తంగా 162 మంది డీలర్లు ఉన్నారు. ఒకేసారి ఈపాస్‌ కుంభకోణంలో 100 మంది డీలర్లకు సంబంధం ఉండడం, వారిని సస్పెండ్‌ చేయంతో డిసెంబర్‌ నెల ప్రజాపంపిణీ ప్రశ్నార్థకం కానునుంది. డిసెంబర్‌లో ప్రజా పంపిణీని కర్నూలు నగరంలో ఎలా చేపట్టాలనే దానిపై పౌర సరఫరా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉన్న డీలర్లకు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించడం, ఇలా సాధ్యం కాకపోతే పట్టణ మహిళా సమాఖ్యల ద్వారా పంపిణీ చేయడం తదితర మార్గాలను అన్వేషిస్తున్నట్లు డీఎస్‌ఓ తిప్పేనాయక్‌ వివరించారు.

మరిన్ని వార్తలు