15 మంది విద్యార్థినులకు అస్వస్థత

20 Oct, 2016 15:08 IST|Sakshi

విజయనగరం: కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా మెరకముడిదం మండలంలోని కస్తూర్బా గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దీంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో.. పాఠశాల సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు