అడవిలో 16 కిలోమీటర్ల కాలినడక

10 Nov, 2016 02:12 IST|Sakshi
అడవిలో 16 కిలోమీటర్ల కాలినడక

గర్భిణీని జడ్డీలో మోసుకొచ్చిన ఆదివాసీలు

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆది వాసీలకు జడ్డీ మోత తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు ఏ కష్టం వచ్చినా జడ్డీ కట్టాల్సి వస్తోంది. మంగళవారం కూడా ఓ నిండు గర్భిణీని సుమారు 16 కిలోమీటర్లు.. అడవిలో జడ్డీలో మోసుకు రావాల్సి వచ్చింది. జిల్లాలోని చర్ల మండల సరిహద్దు చెన్నాపు రానికి చెందిన కుడుం రేష్మ నిండు గర్భిణీ. మంగళవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభం కాగా, బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అరుుతే ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. విషయం తెలుసుకున్న కుర్నపల్లి ఆరోగ్య ఉపకేంద్రం సెకండ్ ఏఎన్‌ఎం గట్టుపల్లి రాజేశ్వరీ తన భర్త శేఖర్ సహాయంతో గ్రామానికి వెళ్లారు.

గర్భిణిని సత్యనారా యణపురం వైద్యశాలకు తీసుకెళ్లేందుకు జడ్డీ కట్టించారు. రేష్మ భర్త ఉం గయ్య, బంధువుల సహకారంతో 16 కిలో మీటర్లు నడిచి మంగళవారం సాయం త్రానికి తిప్పాపురం శివారుకు చేరుకున్నారు. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్ రావడంతో సత్యనారా యణ పురం ఫోన్ చేసి 108 అంబులెన్‌‌సను పిలిపిం చారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి సత్య నారాయణపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చగా.. అర్ధరాత్రి వరకు పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవానికి అవకాశం లేదని గుర్తించారు. వెంట నే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా బుధవారం తెల్ల వారుజామున రేష్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యం గానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలిం చేందుకు కృషి చేసిన రాజేశ్వరి, ఆమె భర్త శేఖర్‌ను పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు