20 టీఎంసీలకు చేరువలో సోమశిల

18 Sep, 2016 22:56 IST|Sakshi
20 టీఎంసీలకు చేరువలో సోమశిల
 సోమశిల: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంత నుంచి వస్తున్న వరద ప్రవాహం ఆదివారం సాయంత్రం తగ్గు ముఖం పట్టింది. జలాశయానికి ఉదయం 18 వేల క్యూసెక్కుల వంతున వస్తున్న వరద ప్రవాహం సాయంత్రానికి 13 వేలకు తగ్గింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 19.5 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన నంద్యాల సమీపంలోని రాజోలు వద్ద గల కుందూనది అనకట్ట వద్ద  5 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. పెన్నానది ప్రధాన హెడ్‌ రెగ్యులేటర్‌ అయిన ఆదినిమ్మాయపల్లి వద్ద 12 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. చెన్నూరు గేజి వద్ద 13,500 క్యూసెక్కుల వరద నమోదైంది.ప్రస్తుతం జలాశయంలో 88.07 మీటర్ల నీటి మట్టం ఉంది. వరద ప్రవాహం మరో 4 రోజలు కొనసాగవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
  
మరిన్ని వార్తలు