జిల్లాలో కొత్తగా 24 బార్లు

24 Jun, 2017 23:28 IST|Sakshi

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డి

అనంతపురం సెంట్రల్‌ : ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్‌ పాలసీ ప్రకారం జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో బార్లు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికలకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న బార్లకు నిబంధనలకనుగుణంగా ఉంటే వాటికి కొత్త లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు.

కొత్త బార్లకు దరఖాస్తుదారులు రూ.2 లక్షలు(తిరిగి చెల్లించని) చలానా కట్టి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బార్లు నడుపుతున్న యజమానులు కూడా ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం అనంతపురం, పెనుకొండ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాల్లో సంప్రదించాలని వివరించారు. ఈ నెల 29లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదే రోజు రాత్రి 9 గంటలలోగా పూరించిన దరఖాస్తులు అనంతపురం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో అందజేయాలని వివరించారు. 30న లాటరీ తీయనున్నట్లు వెల్లడించారు.

నూతన పాలసీతో పెరగున్న బార్లు ఇలా
పట్టణం         ప్రాంతం                 ప్రస్తుత బార్లు     కొత్తవి    మొత్తం     
అనంతపురం     కార్పొరేషన్‌          2                  6           8    
తాడిపత్రి        మున్సిపాలిటీ         1                  2           3    
గుంతకల్‌        మున్సిపాలిటీ         –                 4           4    
రాయదుర్గం        మున్సిపాలిటీ      –                  2          2    
గుత్తి        మున్సిపాలిటీ               –                 1           1    
పామిడి        నగర పంచాయతీ      –                 1           1    
ధర్మవరం        మున్సిపాలిటీ        1                  3           4    
హిందూపురం     మున్సిపాలిటీ      4                 1           5    
కదిరి         మున్సిపాలిటీ            –                  2           2    
కళ్యాణదుర్గం     మున్సిపాలిటీ       –                  1          1    
మడకశిర        నగర పంచాయతీ   –                 1           1

మరిన్ని వార్తలు