ఏపీలో 245 కరువు మండలాల గుర్తింపు

21 Oct, 2016 18:13 IST|Sakshi
ఏపీలో 245 కరువు మండలాల గుర్తింపు

విజయవాడ: గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడు జిల్లాల్లో 245 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కే ధనుంజయ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. అనంతపురంలో 63, చిత్తూరులో 53, కర్నూలులో 36, కడపలో 32, నెల్లూరులో 27, ప్రకాశంలో 23 , శ్రీకాకుళంలో 11 కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 మధ్య) రాష్ట్రంలో సగటున 556 మిల్లీమీటర్ల కనీస సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 533.8 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే 4 శాతం తక్కువ వర్షం కురిసింది.

గత ఏడాది ఇదే కాలంలో 519.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వర్షపాతం, పడిపోయిన పంటల సాగు విస్తీర్ణం, పంట దిగుబడి తగ్గుదల తదితర మార్గదర్శకాలకు లోబడి 245 మండలాలను కరువు ప్రాంతాలుగా నిర్ధారించినట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు