248 మంది బాల కార్మికుల గుర్తింపు

29 Jul, 2016 10:21 IST|Sakshi
సోంపేట : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అదనపు డీజీపీ (సీఐడీ) ప్రత్యేక కమిషన్, మహిళాభివృద్ధి,  శిశు సంక్షేమ శాఖ  ఆదేశాల మేరకు జూలై 1  నుంచి   31 వరకు ఆపరేషన్‌ ముష్కాన్‌–2 కార్యక్రమం నిర్వíß స్తున్నట్టు డీసీపీవో కె.వి.రమణ తెలిపారు. ఈ నెల 28 వరకు నిర్వహించిన దాడులలో మొత్తం 248 మంది బాలకార్మికులను గుర్తించడం జరిగిందన్నారు.  గురువారం సోంపేట, బారువ గ్రామాల్లో దాడులు నిర్వహించి  19 మంది బాల కార్మికులను గుర్తించామన్నారు. బాలలతో పని చే యించినా, యాచక వృత్తి చేయించినా, అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో  పీవీ రమణ, ఏఎస్‌.ఐ, ఐ.లక్ష్మినాయుడు బాలల రక్షణాధికారి, రాజీవ్‌ విద్యామిషన్‌ అధికారి  రాజారావు,  చైల్డ్‌లైన్‌ సిబ్బంది జాస్మిన్‌ కుమారి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు