పాత నోట్లతో 24 వరకు పన్నులు..

16 Nov, 2016 00:12 IST|Sakshi
పాత నోట్లతో 24 వరకు పన్నులు..

సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో  ఈ నెల 24వ తేదీ వరకు ప్రస్తుత సంవత్సర ఆస్తిపన్ను, గత బకాయిలు, ట్రేడ్‌లైసెన్స్ లను  చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని  నగరవాసులు వినియోగించుకోవాల్సిందిగా  జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌ డా.బి.జనార్ధన్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు జీహెచ్‌ఎంసీ  పౌరసేవా కేంద్రాలు ఉదయం 10:30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని, వీటితో పాటు అన్ని మీ–సేవా, ఈ–సేవా కేంద్రాల్లో పన్నులు చెల్లించవచ్చునని తెలిపారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు, వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌లను మాత్రం జీహెచ్‌ఎంసీ  పౌర సేవా కేంద్రాల్లో మాత్రమే జమచేయాలని తెలిపారు.

 

మరిన్ని వార్తలు