‘పేట’తో పాతికేళ్ల అనుబంధముంది

21 Aug, 2016 19:35 IST|Sakshi
‘పేట’తో పాతికేళ్ల అనుబంధముంది
సూర్యాపేట : సూర్యాపేట పట్టణానికి నేను కొత్తేమి కాదని, పేటతో నాకు పాతికేళ్ల అనుబంధం ఉందని తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన మర్చంట్స్‌ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేటలోని వ్యాపారులతో తనకు దగ్గరి సంబంధాలు, మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెనాలికి వెళ్లేటప్పుడు ఎక్కువగా సూర్యాపేటలోనే ఆగి విశ్రాంతి తీసుకున్నానని పేర్కొన్నారు. సూర్యాపేటకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రముఖ పట్టణం ఉందంటే అది సూర్యాపేటేనని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పేటకు పూర్వ వైభవం తీసుకొచ్చే సమయం కేవలం రెండు రోజులు మాత్రమే ఉందని నిండు సభలో తెలపడంతో వ్యాపారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సూర్యాపేట ఆర్యవైశ్య సంఘానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రకటించిన అవార్డును రోశయ్య చేతుల మీదుగా ఆ సంఘం సభ్యులు మురళీధర్, ఈగా దయాకర్, విద్యాసాగర్, గోపారపు రాజులకు అందజేశారు. అలాగే ఈ నలుగురికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నతపదవులు కట్టబెట్టనున్నట్టు ప్రపంచ మహాసభ ఆర్యవైశ్య అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు బ్రాహ్మాండ్లపల్లి మురళీధర్‌గుప్త, ఈగా దయాకర్, నరేంద్రుని విద్యాసాగర్, రవీందర్, వీరెల్లి లక్ష్మయ్య, మల్లిఖార్జున్, ఉప్పల శారద, ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, దైవాదినం, నూకా వెంకటేశంగుప్త, బాలచంద్రుడు, గోపారపు రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
రోశయ్యకు స్వాగతం పలికిన మంత్రి
తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మర్చంట్స్‌ డే కార్యక్రమానికి హాజరైందుకు వస్తూ ముందుకు పట్టణంలోని రహదారి బంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పూలబోకె అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. స్వాగతం పలికిన వారిలో నాయకులు టీఆర్‌ఎస్‌ నాయకులు కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, మోదుగు నాగిరెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, కటికం శ్రీనివాస్, కోడి సైదులుయాదవ్, తూడి నర్సింహారావు తదితరులు ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు