290.08 మిల్లీమీటర్ల వర్షపాతం

4 Aug, 2016 21:08 IST|Sakshi
ఏలూరు సిటీ : జిల్లాలో గత 24 గంటల్లో 290.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా వేలేరుపాడు మండలంలో 31.08 మిల్లీమీటర్ల వాన పడగా,  పెదపాడు మండలంలో అత్యల్పంగా 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుకునూరులో 27.2, తాళ్లపూడిలో 13.8, పోలవరంలో 13.6, కొయ్యలగూడెంలో 13, టీ.నర్సాపురంలో 12.4, గోపాలపురం, బుట్టాయిగూడెంలలో 11.4, దేవరపల్లిలో 9.8, జీలుగుమిల్లి, నిడదవోలుల్లో 9.2, దెందులూరు, కామవరపుకోటలలో 8.4, చాగల్లు, జంగారెడ్డిగూడెంలలో 8.2, కొవ్వూరులో 7.8, నల్లజర్లలో 7.2, ద్వారకాతిరుమలలో 6, తాడేపల్లిగూడెంలో 5.6, భీమడోలు, లింగపాలెం, చింతలపూడిలలో 5.2, పెనుగొండలో 4.6, నిడమర్రులో 4.4, ఉంగుటూరులో 4.2, పెంటపాడులో 4, ఉండ్రాజవరం, పెదవేగిలలో 3.8, ఇరగవరం, తణుకులలో 3.4, అత్తిలిలో 3.2, ఆచంటలో 3, పెరవలిలో 2.8, ఏలూరులో 2.2, పెనుమంట్ర, గణపవరంలలో 2.4, పాలకొల్లులో 1.8, యలమంచిలిలో 1.6  మిల్లీమీటర్ల వాన పడింది. 
 
 
 
 
 
 
 
 
 
  
 
 
 
మరిన్ని వార్తలు