హార్బర్‌లో రెండో ప్రమాద సూచిక

12 Dec, 2016 14:28 IST|Sakshi
హార్బర్‌లో రెండో ప్రమాద సూచిక
నిజాంపట్నం: వర్ధా తుఫాను హెచ్చరికలతో నిజాంపట్నం హార్బర్‌లో రెండో నంబరు ప్రమాద సూచిక కొనసాగుతున్నదని పోర్టు కన్జర్వేటర్‌ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారటంతో మూడు రోజులుగా రెండో నంబరు ప్రమాద సూచికను కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం–నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తీరం దాటే సమయంలో ఒక మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని వార్తలు