3 వేల గొంతుల జనగణమన

24 Aug, 2016 04:39 IST|Sakshi
3 వేల గొంతుల జనగణమన
 
  • మార్మోగిన చంద్రంపాలెం స్కూలు 
  • ఘనంగా ఆంధ్ర కేసరి జయంతి
మధురవాడ: విద్యార్థులు జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని ఆర్‌జేడీ వి.భార్గవ్‌ అన్నారు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ‘ఆజాద్‌–70’ పేరిట మంగళవారం చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 3 వేల మంది విద్యార్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ జాతీయ యోథులు ఎంతో మంది తమ ప్రాణాలు తణప్రాయంగా భావించి స్వాతంత్య్ర పోరాటం చేశారని, వారి త్యాగ నిరతి మరువ లేనిదని చెప్పారు. డీఈవో ఎంవీ కష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దేశ భక్తిని, సేవా తత్వాన్ని పెంపొందించు కోవాలని చెప్పారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయాలని చెప్పారు.
 
మహనీయుడు ప్రకాశం
రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతిని పురస్కరించుకుని చంద్రంపాలెం పాఠశాలలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసిన నివాళులు అర్పించారు. బ్రిటిష్‌ వారి తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన యోథుడు ప్రకాశమని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రాజబాబు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు