బోరుబావిలో పడిన ఏడాది బాలుడు

28 Nov, 2015 10:53 IST|Sakshi
బోరుబావిలో పడిన ఏడాది బాలుడు
పుల్కల్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెంలో ఏడాది బాలుడు బోరుబావిలో పడ్డాడు. రాకేష్ అనే చిన్నారి శనివారం ఉదయం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు,  గ్రామస్తులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడు ఘటనపై డీఎమ్, హెచ్ఓకు 'సాక్షి' సమాచారం అందించింది. విషయం తెలిసిన అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాలుడిని రక్షించేందుకు చర్యలు అధికారులు వేగవంతం చేశారు. ట్యూబ్ హాయంతో బావిలోకి ఆక్సిజన్ పంపుతున్నారు. జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా పెద్ద గుంత తవ్వుతున్నారు. పుల్కల్ ఎస్‌ఐ సత్యనారాయణ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కాగా బాలుడి ఇంటి పక్కనే రాములు అనే రైతు బోరు వేయించినట్లు తెలిసింది. బోరు లో నీరు పడక పోవడంతో గుంతపై కనీసం మూతవేయకుండా వదిలేయడం వల్లే ప్రమాదం జరిగింది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు గుంతలో పడిపోయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
 
మరిన్ని వార్తలు