32.2 మి.మీ వర్షపాతం నమోదు

23 Sep, 2016 23:32 IST|Sakshi
ఏలూరు (మెట్రో) : జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఎం.బాలకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా 147.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవగా అత్యల్పంగా పెదపాడు, మొగల్తూరు మండలాల్లో 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. మిగిలిన మండలాల్లో కొయ్యలగూడెంలో 119.2, కామవరపుకోటలో 108.2, గోపాలపురంలో 101.4, బుట్టాయిగూడెంలో 100.8, పోలవరంలో 92.2, జీలుగుమిల్లిలో 82.6, కుక్కునూరులో 82.2, తాళ్లపూడిలో 62.2 మి.మీ వర్షపాతం నమోదైంది. చింతలపూడిలో 60.4, కొవ్వూరులో  53.6, టి.నరసాపురంలో 52.4, వేలేరుపాడులో 50.4, ద్వారకాతిరుమలలో 46.4, దేవరపల్లి, తణుకులో 29.6, పెంటపాడులో 29.4, పెరవలిలో 25, నల్లజర్లలో 21.4 మి.మీ వర్షం కురిసింది. పెనుగొండలో 21.2, ఇరగవరంలో 19.2, పోడూరులో 18, ఉండ్రాజవరంలో 17.4, తాడేపల్లిగూడెంలో 16.4, అత్తిలి, ఆచంటలలో 15.4, వీరవాసరంలో 15, నిడమర్రులో 14.8, నిడదవోలులో 12.2, చాగల్లులో 11.4, ఉంగుటూరులో 11.2, యలమంచిలిలో 8.2, గణపవరంలో 8, పాలకోడేరులో 7.4, పెనుమంట్రలో 6.8, దెందులూరులో 6.2, పాలకొల్లులో 5, భీమడోలులో 4.2, భీమవరంలో 3.4, ఏలూరు, ఆకివీడులలో 3, లింగపాలెం, కాళ్లలో 2, పెదవేగిలో 1.8, నరసాపురంలో 1.4, ఉండిలో 0.6 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందని సీపీవో తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు