గ్రామీణ ప్రాంతాలకు 3జీ సేవలు

7 Jun, 2017 23:04 IST|Sakshi

అనంతపురం రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు 3జీ సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ శ్రీకారం చుట్టినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన టెక్నికల్‌ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. జిల్లాకు నూతనంగా 45 3జీ టవర్లు మంజూరయ్యాయని, జూలై మొదటి వారంలోపు వినియోగదారులకు 3జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జనరల్‌ మేనేజర్‌ ఆదేశించారు. గోళ్ల, కణేకల్, కొట్నూరు, న్యామద్దల, పేరూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఒక 3జీ టవర్‌తో నాలుగు కిలోమీటర్ల వరకు మెరుగైన నెట్‌వర్క్‌ ఉంటుందన్నారు.

నూతన నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్‌:
నెక్ట్స్‌ జనరేషన్‌ నెట్‌వర్క్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హిందూపురం, ధర్మవరం పట్టణ కేంద్రాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎక్స్చేంజ్‌లలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌ రాకతో ల్యాండ్‌ లైన్‌కు సైతం వీడియో కాల్‌ మాట్లాడుకునే ఆవకాశం ఉండడంతో పాటు మొబైల్స్‌ కాల్‌ వాయిస్‌ ఎలాంటి అంతరాయం ఉండదన్నారు. ఎన్‌జీఎల్‌ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న 116 ఎక్స్ఛేంజ్‌లలో అమర్చుతున్నట్లు జనరల్‌ మేనేజర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు