మూడు కిలోల కణితి తొలగింపు

2 Aug, 2016 23:13 IST|Sakshi
మూడు కిలోల కణితి తొలగింపు

నల్లగొండ టౌన్ః
జిల్లా కేంద్రంలోని గ్రీన్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో మంగళవారం  మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి కడులోంచి మూడు కిలోల కణితిని తొలగించారు. వేములపల్లి మండలం పుచ్చకాయలగూడేనికి చెందిన ప్రమీల కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. పరీక్షలను నిర్వహించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించి  మంగళవారం డాక్టర్‌ సునిత, డాక్టర్‌ వేణు, డాక్టర్‌ నర్సింహ్మ, డాక్టర్‌ అన్సారీల బృందం ఆమెకు శస్త్ర చికిత్సను నిర్వహించి కణితిని తొలగించారు.
 

మరిన్ని వార్తలు