హార్బర్‌లో మూడో నంబర్‌ ప్రమాద సూచిక

12 Dec, 2016 14:24 IST|Sakshi
హార్బర్‌లో మూడో నంబర్‌ ప్రమాద సూచిక
నిజాంపట్నం: వార్దా తుపాను ప్రభావంతో హార్బర్‌లో మూడో నంబర్‌ ప్రమాద సూచికను ఎగరవేసినట్లు పోర్టు కన్జరవేటర్‌ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. వార్దా తుపాను చెనై​‍్న పయనిస్తోందని సోమవారం అక్కడే తీరందాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈదురుగాలులు రేవును తాకవచ్చన్న.. సమాచారం ఉన్నప్పుడు మూడో నంబర్‌ ప్రమాద సూచికను ఎగరవేస్తారని తెలిపారు. సముద్రపు వేటలో ఉన్న బోట్లన్నీ వేట నుంచి తిరిగి హార్బర్‌ ఒడ్డుకు చేరాయని ఆయన వివరించారు. 
 
తుపాను ప్రభావంపై తెనాలి ఆర్డీవో అధికారులతో చర్చ..
తెనాలి ఆర్డీవో నరసింహులు ఆదివారం హార్బర్‌లో పర్యటించి మత్స్యశాఖ అధికారులతో, పోర్టు కన్జర్వేటర్‌ ఎం.వెంకటేశ్వరావుతో చర్చించారు. తుపాను ప్రభావం తీరప్రాంతంపై ఏవిధంగా ఉండబోతోందన్న అంశంపై మాట్లాడారు. తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండే అవకాశం లేదని, అయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట తహశీల్దార్‌ పి.మోహన్‌కృష్ణ తదితరులున్నారు.
మరిన్ని వార్తలు