జిల్లాలో 4 వేరుశనగ కొనుగోలు కేంద్రాలు

19 Dec, 2016 00:12 IST|Sakshi
- రూ.4220తో కొనుగోలుకు ఆయిల్‌ఫెడ్‌ సిద్ధం
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో వేరుశనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం క్వింటాలు కనీస మద్దతు ధరగా రూ.4220గా ప్రకటించింది. మార్కెట్‌లో చాల వరకు ఈ ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆయిల్‌ ఫెడ్‌ రంగం సిద్ధం చేసింది. నాఫెడ్‌ ఆధ్వర్యంలో ఆయిల్‌ఫశ్రీడ్‌ కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుంది. వేరుశనగ సాగు ఎక్కువగా ఉన్న ఆదోని, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్‌ జిల్లా ఇన్‌చార్జీ అంకిరెడ్డి తెలిపారు. కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించేది ఒకటి, రెండు రోజుల్లోలో తెలియజేస్తామన్నారు. 
 
మరిన్ని వార్తలు