పాలమూరులో ‘విభజన’ మంటలు

7 Oct, 2016 04:06 IST|Sakshi
పాలమూరులో ‘విభజన’ మంటలు

* యువకుడి ఆత్మహత్యాయత్నం   
* మరికల్‌లో అంతర్రాష్ట్ర రహదారి దిగ్బంధం

నారాయణపేట/మక్తల్: జిల్లాల పునర్విభజన మంటలు పాలమూరులో ఎగిసిపడుతున్నాయి. నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతమైంది. రెండోరోజు మరికల్‌లో అంతర్రాష్ర్ట రహదారిని అఖిలపక్షం నాయకులు దిగ్బంధిం చారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రాజీనామాకు మద్దతుగా టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఎం.జ్యోతి, లక్ష్మి, అమీరుద్దీన్, కాకర్ల నారాయణమ్మ, తరుణబేగం, విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మక్తల్‌ను మహబూబ్‌నగర్‌లోనే కొనసాగించాలని   రామకృష్ణ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  
 
మండలం కోసం టవరెక్కి..
వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేటను మండలంగా ప్రకటించకపోవడంతో గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు ఆరుగురు యువకులు సెల్‌టవరెక్కి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై బైఠారుుంచడంతో ఇరువైపులా 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.  యువకులతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి హామీ ఇచ్చినా వారు ససేమిరా అన్నారు. మండల సాధన సమితి నేతలు దీక్షకు కూర్చున్నారు. గ్రామ పంచాయతీ వాటర్‌మన్  సతీష్ ఆగ్రహంతో ఒంటిపై కిరోసిన్  పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు