5 కిలోల కణితి తొలగింపు

23 Aug, 2016 20:54 IST|Sakshi

స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన గంగక్క(70)కు శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు ఐదు కిలోల కణతి తొలగించారు. పది రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరగా.. కడుపులో కణతి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్సకు సిద్ధం కాగా..ఆమె గుండెకు వెళ్లే రక్తనాళాలు మూసుకుపోయాయి. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నా వైద్యులు రిస్కు చేశారు. సర్జన్, అనస్తీషీయ వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ చేసిన వారిలో రిమ్స్ డెరైక్టర్ అశోక్, అనస్తీషియా వైద్యులు నరేందర్‌బండారి, నరేందర్‌రాథోడ్, మనోహర్, సుష్మభూషరెడ్డి, సూరజ్ ఉన్నారు.

 

మరిన్ని వార్తలు