5 నుంచి సిటీబస్సుల సందడి

30 Jan, 2017 00:10 IST|Sakshi
  • మొదటి రెండు రోజులూ ఉచితం ∙
  • ఎంపీ మురళీమోహ¯ŒS
  • రాజమహేంద్రవరం సిటీ : 
    ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు  ఎంపీ మురళీమోహ¯ŒS పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేష¯ŒS కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఎంపీ  మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఉచితంగా నడిపేందుకు ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. మొదటి విడతగా 10 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఈ ఏడాది చివరకు దఫదఫాలుగా 50 బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మొదలయ్యే ఈ బస్సులను నగర వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బస్సులు నడిచేందుకు వీలుగా రహదారి ఆక్రమణలు తక్షణమే తొలగించే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. బస్సులు ఆగేందుకు స్టాండ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. టిక్కెట్‌ ధర రూ.7 నుంచి రూ.18Sవరకూ నిర్ణయించారన్నారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో పబ్లిక్‌ ట్రా¯Œ్సపోర్ట్‌ పెరగాలన్నారు. ప్రస్తుతం అధికారుల నిర్ణయించిన మూడు రూట్లలో కాకుండా ప్రయాణీకులకు అనువుగా ఉండే విధంగా బస్సులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కమినషర్‌ విజయరామరాజు, ఆర్టీసీ అధికారులు ఆర్‌వీఎస్‌ నాగేశ్వర్రావు, పెద్దిరాజు కుమార్‌ పాల్గొన్నారు.  
     
>
మరిన్ని వార్తలు