51సార్లు రక్తదానం

16 Aug, 2016 22:16 IST|Sakshi
బాదె పాపారావుకు సన్మానం
  • రక్తదాత బాదె పాపారావుకు నర్సాపూర్‌లో సన్మానం
  • నర్సాపూర్‌: 51 సార్లు రక్తదానం చేసిన నర్సాపూర్‌కు చెందిన బాదె పాపారావును ఆదర్శంగా తీసుకుని యువకులు రక్తదానం చేయాలని హనుమాన్‌ సేన అధికార ప్రతినిధి వాల్దాస్‌ మల్లేశ్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మణికొండ ఫంక్షనహాలులో హనుమాన్‌ సేన ఆధ్వర్యంలో రక్తదానంపై విద్యార్థులకు కల్పించిన అవగాహన సదస్సులో 51 సార్లు రక్తదానం చేసిన పాపారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ నర్సాపూర్‌కు చెందిన పాపారావు తన 49 ఏళ్ల వయస్సులో 51సార్లు రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు.

    హనుమాన్‌సేన అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ రక్తదానంపై విద్యార్థులకు,యువకులకు అవగాహన కల్పించేందుకే పాపారావుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దచింతకుంట ఉన్నత పాఠశాల హెడ్మాష్టరు గుండం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. లయన్స్‌క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన వయస్సు కన్నా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన పాపారావును అందరూ ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేయాలన్నారు.

    సోమవారం నాటికి 51సార్లు రక్తదానం: పాపారావు
    నర్సాపూర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తాను రక్తదానం చేశానని, దీంతో 51సార్లు రక్తదానం చేశానని రక్తదాత బాదె పాపారావు చెప్పారు. కార్యక్రమంలో అశోక్‌కుమార్‌, నాగరాజుగౌడ్‌, పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు