వరంగల్ లో 56 నామినేషన్ల తిరస్కరణ

26 Feb, 2016 03:55 IST|Sakshi

వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పాలక సంస్థలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 58 డివిజన్ల నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు 1,350 నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా.. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలను గురువారం పరిశీలించారు. వేర్వేరు కారణాలతో 56 నామినేషన్లను తిరస్కరించారు. 1,294 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. శుక్రవారం చేపట్టనున్న ఉపసంహరణల ప్రక్రియ పూర్తయ్యాక బరిలో ఉండే అభ్యర్థులు వివరాలు వెల్లడికానున్నాయి. తిరస్కరణకు గురైన నామినేషన్లలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 30 సెట్లు ఉండటం గమనార్హం.  14, 16 డివిజన్లకు చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు అఫిడవిట్‌పై సంతకం చేయడం మరిచిపోయారు. దీనిపై ప్రత్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు వారి నామినేషన్లను తిరస్కరించారు.

మరిన్ని వార్తలు