ఆర్టీసీకి గత తొమ్మిది నెలల్లో రూ.600 కోట్లు నష్టం

19 Jan, 2017 22:24 IST|Sakshi
ఆర్టీసీకి గత తొమ్మిది నెలల్లో రూ.600 కోట్లు నష్టం
మార్చి నెలాఖరుకు రూ.800 కోట్లుకు పెరిగే అవకాశం
స్థలాలు లీజుకిద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు
ఆర్టీసీ ఈడీ (అడ్మిన్‌) ఏ వేంకటేశ్వరరావు
అన్నవరం (ప్రత్తిపాడు) :  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్‌ నెలాఖరుతో ముగిసిన తొమ్మిది నెలలకుగాను   రూ.600 కోట్లు నష్టం వచ్చిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌) ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నష్టాలు ఇదే విధగా కొనసాగితే ఈ మార్చి నెలాఖరుకు రూ.800 కోట్లు వరకూ సంస్థ నష్టపోయే అవకాశం ఉందన్నారు. నష్టాలు అధిగమించడానికి తాము అనేక చర్యలు తీసుకుటున్నా అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదన్నారు.
 లీజుకిద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు...
ఆర్టీసీ స్థలాలు లీజుకిద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రెండు వేల ఎకరాల ఖాళీ స్థలాలున్నాయన్నారు. వ్యాపార సముదాయాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వీటిని లీజు కిచ్చేందుకుగాను మొదట పదేళ్లు లీజు పీరియడ్‌ నిర్ణయించామని తెలిపారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని 33 సంవత్సరాల నుంచి ప్రస్తుతం 43 సంవత్సరాలకు ఈ లీజు పీరియడ్‌ పెంచి టెండర్లు పిలిచినా స్పందన కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం 15 ఎకరాలు మాత్రమే లీజుకు ఇచ్చామని తెలిపారు. ఈయన వెంట తుని డిపో మేనేజర్‌ రామకృష్ణ, సూపర్‌వైజర్‌ శర్మ తదితరులున్నారు.
 
 
 
 
 
మరిన్ని వార్తలు