ఖమ్మంలో 650 డెంగ్యూ కేసులు

5 Oct, 2016 17:52 IST|Sakshi

► డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు
బోనకల్‌ (ఖమ్మం జిల్లా): పారిశుద్ధ్యలోపంతోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులు నమోదయ్యయని డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండలరావు అన్నారు. ఖమ్మం శ్రీరక్ష ఆసుపత్రి, లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 650 డెంగీ కేసులో నమోదు కాగా అత్యధికంగా జోనకల్‌ మండలంలోనే ఉన్నాయన్నారు. మంత్రి, జిల్లా కలెక్టర్‌ దృష్టిఅంతా బోనకల్‌ మండలంపైనే ఉందన్నారు. పారిశుద్ధ్య లోపంవల్లే విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు.
 

మరిన్ని వార్తలు