7.3 మిలియన్ల పొగాకు కొనుగోలు

17 May, 2017 00:24 IST|Sakshi
7.3 మిలియన్ల పొగాకు కొనుగోలు
కొయ్యలగూడెం : ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని 5 వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో ఇప్పటివరకు 7.3 మిలియన్ల పొగాకు కొనుగోలు చేసినట్టు పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ ఎం.శ్రీరామమూర్తి పేర్కొన్నారు. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మొత్తం 45.79 మిలియన్‌ కేజీల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతి ఇచ్చిందన్నారు. ఇంకా రైతుల నుంచి 38.49 మిలియన్‌కేజీల పొగాకును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. 47 రోజలుగా నిర్వహించిన పొగాకు వేలంలో 57,238 బేళ్లను రైతులు వేలం కేంద్రానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. కొయ్యలగూడెంలో 12,64,138 కేజీల పొగాకు అమ్మకం కాగా, సగటు ధర రూ.144.70 వచ్చిందన్నారు. జంగారెడ్డిగూడెం–1 కేంద్రంలో 21,15,540 కేజీల పొగాకు  , సరాసరి రూ.143.35 వచ్చిందన్నారు. జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 17,48,408 కేజీలకు సరాసరి రూ.143.89 రాగా, దేవరపల్లిలో 8,33,768 కేజీలకు సరాసరి రూ.144.26 రాగా గోపాలపురం వేలం కేంద్రంలో 13,66,222 కేజీల పొగాకు అమ్మకానికి 145.98 రూపాయల సరాసరి ధర వచ్చిందని తెలిపారు. సగటు ప్రకారం అత్యధికంగా గోపాలపురం, కొయ్యలగూడెం ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.   
 
మరిన్ని వార్తలు