యాదాద్రిలో ఏడు జంటల అరెస్ట్

23 Oct, 2016 21:07 IST|Sakshi
యాదాద్రిలో ఏడు జంటల అరెస్ట్

యాదాద్రి: ప్రపంచస్థాయి దేవాలయంగా నల్లగొండ జిల్లా యాదాద్రిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఇప్పటికే ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తుండగా.. ఆ మేరకు శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆదివారం ఏడు జంటలతో పాటు బహిరంగంగా మద్యం సేవిస్తున్న 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రంలో (కొండ కింద) దాదాపు 21 ప్రైవేట్ లాడ్జిలు ఉన్నాయి. వీటిలో 20 లాడ్జిలపై ఆదివారం ఒకేసారి దాడులు నిర్వహించిన పోలీసు బృందాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడు జంటలను అరెస్ట్ చేశాయి. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు