7 వేల పోస్టులకు నోటిఫికేషన్లు

27 Jan, 2017 00:53 IST|Sakshi
7 వేల పోస్టులకు నోటిఫికేషన్లు

వచ్చే నెల మొదటి వారంలో జారీ చేస్తాం: టీఎస్‌పీఎస్సీ

పాత, కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీ
అనంతరం మరిన్ని ఉద్యోగ పరీక్షలు కూడా..
మొత్తంగా ఈ ఏడాది 10 వేల పోస్టుల భర్తీ
వచ్చే నెలలోనే గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఫలితాలు
కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గురుకులాల్లో ఖాళీ గా ఉన్న పోస్టులతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే గురుకులాల్లో కలిపి 7 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నామని, ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. గురుకులాల కోసం ప్రభు త్వం మంజూరు చేసిన 23,494 పోస్టులకుగాను మొదటి విడతలో ఈ 7 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు 6 రకాల నోటిఫికేషన్లను జారీ చేస్తామని తెలిపారు.

 మిగతా పోస్టులకు వచ్చే రెండేళ్లలో నోటిఫికేషన్లు జారీ అవుతాయన్నారు. బుధవారం ముఖ్యమంత్రి సంతకం చేసిన 1,900 పోస్టులకు సంబంధించి కూడా ఈలోగా ఉత్తర్వులు వస్తాయని.. అవసరమైన ఇండెంట్లను ఆయా శాఖల నుంచి తెప్పించుకుంటామని చెప్పారు.  ఫిబ్రవరి 10లోగా మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలే జీల్లో 500 లెక్చరర్‌ పోస్టులు, 150కి పైగా రెసిడెన్షి యల్‌ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అలాగే గురుకు లాల్లో ప్రిన్సిపాల్, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీ టీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), లైబ్రేరి యన్, పీఈటీ, స్టాఫ్‌ నర్సు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌కు సంబంధించిన స్పెషల్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. మొత్తం ఈ ఏడాది 10 వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు.

వచ్చే నెలలోనే గ్రూప్స్‌ ఫలితాలు
2011కు సంబంధించిన గ్రూప్‌–1 రాత పరీక్షల ఫలి తాలను, 1,036 పోస్టుల భర్తీకి గత నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్‌–2 రాత పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదల చేస్తామని చక్రపాణి తెలిపారు. గ్రూప్‌–1కు ఇంటర్వూ్యలను మార్చిలో నిర్వహించే అవకాశముందని.. గ్రూప్‌–2 ఇంటర్వూ్యలను ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఇంటర్వూ్యలను నిర్వహిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు