క్విట్‌ ఇండియాకు 75 ఏళ్లు

10 Aug, 2016 00:12 IST|Sakshi
క్విట్‌ ఇండియాకు 75 ఏళ్లు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మహాత్మాగాంధీ యావద్దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు 1942 ఆగష్టు 8వ తేదీన నాంది పలికిన∙క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు నిండాయి. మంగళవారం ఆ ఉద్యమ పటిమ, స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ మాంటిస్సోరి విద్యార్థులు నగరంలో భారీ త్రివర్ణ పతకాన్ని ప్రదర్శించారు. 102 మీటర్ల  పతకాన్ని నగరంలోని కలెక్టరేట్‌ నుంచి రాజ్‌విహార్‌ వరకు ప్రదర్శించారు. నాడు గాందీజీ దేశానికి స్వాతంత్య్రం కోసం బ్రిటిషు వాళ్లను దేశం నుంచి వెళ్లండి అని డూ అర్‌ డై నినాదాన్ని ఇచ్చారు. నేడు దేశాభివద్ధికి ప్రతిఘటకంగా మారిన అవినీతి, అక్రమాలు, బాలకార్మిక వ్యవస్థ, గహహింస, ప్రజాస్వామ్య విలువల పతనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలువురు విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో డూ బీ ఫోర్‌ ఉయ్‌ డై అను నినాదాలు ఇస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీని కలెక్టరేట్‌ వద్ద కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం శశికళ జెండా ఊపి ప్రారంభించారు.
 
మరిన్ని వార్తలు